ఆ ఉన్నతాధికారికి వినతి పత్రం.. విషయమేమిటంటే..?

by  |
ఆ ఉన్నతాధికారికి వినతి పత్రం.. విషయమేమిటంటే..?
X

దిశ, రంగారెడ్డి: లాక్ డౌన్ తో కార్మికుడు ఉపాధి అవకాశాలు కోల్పోవడంతో ఇబ్బందులు పడుతున్నారని కార్మిక సంఘాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎన్టీయూసీ కార్మిక సంఘాలు శుక్రవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ… కార్మికుల చట్టాలు రద్దు, సవరణ కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నాయన్నారు. రోజుకు 12 గంటల పని సమయం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు కనీస వేతనం రూ.7500, రేషన్ సరుకులు ఇవ్వాలని కోరారు. ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలని, భవన నిర్మాణం కార్మికులకు బోర్డ్ నుంచి రూ.5000 ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు పర్వతాలు, యాదయ్య, ఝాన్సీ, సీఐటీయూ నాయకులు జగదీష్, చంద్రమోహన్, ఐఎన్టీయూసీ నాయకులు దనంజయ్య, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed