తెలంగాణకు ‘కల్వకుంట్ల’ వైరస్: టీపీసీసీ

by  |

దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణకు కల్వకుంట్ల కరోనా వైరస్ సోకిందని టీపీసీసీ అధికార ప్రతినిధి దేవని సతీష్ ఎద్దేవా చేశారు. బుధవారం గాంధీ‌భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కల్వకుంట్ల కరోనా వైరస్ నుంచి తెలంగాణను కాపాడలన్నారు. బూటకపు వాగ్దానాలతో ప్రజలను సీఎం కేసీఆర్ మోసం చేసి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. ఎంపీ రేవంత్ రెడ్డి డబుల్ బెడ్ రూమ్ అంశాలపై పట్నం గోస కార్యక్రమం చేపట్టడం టీఆర్ఎస్‌కు మింగుడు పడడంలేదన్నారు. జన్వాడ లో కేటీఆర్ చిన్న సముద్రం అనే చెరువును పూడ్చేసి ఆక్రమించుకున్నారని, 111 జీఓ పరిధిలోని 700 ఎకరాల భూమిని కల్వకుంట్ల కుటుంబ సభ్యులు కబ్జా చేశారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డిపై ఆరోపణలు చేసేందుకే దళిత ఎమ్మెల్యేలు బాల్క సుమన్, గువ్వల బలరాజులకు కేసీఆర్ పదవులు ఇచ్చారని అన్నారు. వాళ్ళు నోరు జారితే ఖబడ్డార్ అని హెచ్చరించారు.

tags : tpcc chief devani satish deva, caronavirus,tpcc chief devani satish deva about caronavirus

Next Story