ఏపీలో రేపు ఆ స్కూళ్లు బంద్

by  |
schools
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో శనివారం బంద్ పాటిస్తున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ అన్ ఎయిడెడ్ స్కూల్స్ అసోసియేషన్ ప్రకటించింది. ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు ఈ బంద్‌లో పాల్గొంటున్నట్లు స్పష్టం చేసింది. ప్రైవేట్ స్కూళ్ల ఫీజులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ బంద్ పాటిస్తున్నట్లు అసోషియేషన్ పేర్కొంది. విజయవాడలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలను తాము అంగీకరించడం లేదని తెలిపారు. ఆచరణసాధ్యం కాని జీవోలను విడుదల చేశారని మండిపడ్డారు.

ఈ జీవోల వల్ల తమకు నష్టం జరుగుతుందని.. అంతేకాకుండా ఈ జీవోలతో నాణ్యమైన ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం ఈ జీవోలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తీసుకువచ్చిన జీవోల వల్ల విద్యాసంస్థలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని అన్నారు. ఫ్యూచర్ లైఫ్ వర్కర్లమైన తమకు సరైన వసతులు లేకపోతే విద్యార్థులకు సరైన భవిష్యత్తే ఉండదని టీచర్లు అంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే బంద్ పాటిస్తున్నట్లు అసోషియేషన్ ప్రకటించింది. ఇటీవలే ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజు నిర్ణయిస్తూ జగన్ సర్కార్ జీవో 53, 54 తీసుకొచ్చింది. ఈ ఫీజులు ఈ విద్యా సంవత్సరం నుంచి 2023-24 విద్యా సంవత్సరం వరకు వర్తిస్తాయని ఆ జీవోల్లో వెల్లడించిన సంగతి తెలిసిందే.


Next Story

Most Viewed