4కే టీవీ సిరీస్‌ను ప్రవేశపెట్టనున్న తోషిబా

by  |
4కే టీవీ సిరీస్‌ను ప్రవేశపెట్టనున్న తోషిబా
X

దిశ, వెబ్‌డెస్క్: భారతీయ టెలివిజన్‌ మార్కెట్‌లోకి అల్టిమేట్‌ 4కే టీవీ సిరీస్‌ను ప్రవేశపెడుతున్నట్టు తోషిబా (Toshiba) ప్రకటించింది. సెప్టెంబర్‌ 18 నుంచి అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, టాటాక్లిక్‌, రియన్స్‌ డిజిటల్‌ ద్వారా క్యూలెడ్‌, ఫుల్‌ ఆరీ యూహెచ్‌డి, స్మార్ట్‌ టెలివిజన్లను ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించింది. ప్రారంభ ఆఫర్‌గా మొదటి నాలుగు రోజులు (2020 సెప్టెంబర్‌ 18 నుండి 21 వరకు) 4కె శ్రేణి కొనుగోళ్లపై ఆకర్షణీయమైన 4 ఏళ్ల ప్యానెల్ వారంటీని అందిస్తున్నట్టు తెలిపింది.

అల్టిమేట్‌ 4కే సిరీస్‌ ఇప్పుడు నెక్ట్స్‌ జనరేషన్‌ వీక్షకులను ఆకర్షించడానికి సిద్దంగా ఉందని, అత్యాధునిక విజువల్, ఆడియో సాంకేతికతను ఉపయోగించి వీక్షకులను ఆకర్షిస్తుందని, పిక్చర్‌ క్వాలిటీ, సౌండ్‌ క్వాలిటీ, డిజైన్లతో సాంకేతిక అవిష్కరణల పరంగా ఈ టెలివిజన్లు ఆకట్టుకుంటాయని కంపెనీ పేర్కొంది. ‘భారత్‌లో తమ నెక్స్ట్ జనరేషన్ తోషిబా 4కే టెలివిజన్లను ప్రవేశపెట్టడం చాలా ఆనందంగా ఉంది.

ప్రఖ్యాత గ్లోబల్‌ బ్రాండ్‌గా, తక్కువ ధరకే మంచి పిక్చర్‌, సౌండ్‌, ఎఐ-అధారిత స్మార్ట్‌ ఫీచర్లతో అత్యున్నత సాంకేతికతో పెద్ద స్క్రీన్‌ సైజ్‌ టెలివిజన్లను అందించడం ద్వారా భారతీయ వినియోగదారులకు టీవి వీక్షించే అనుభవాన్ని మెరుగుపరచడమే సంస్థ లక్ష్యం. ఎఐ-ఆధారిత సాంకేతికతతో వినియోగదారులు వివిధ రకాలైన కంటెంట్‌లను లార్జ్ స్క్రీన్‌పై చూడగలుతారని’ తోషిబా టెలివిజన్స్‌ ఇండియా సీవోవో రిషి టాండన్‌ చెప్పారు.

Next Story