టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. మొత్తం 62 మందిని విచారించాలని ఈడీ ప్లాన్

by  |
Drugs case
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సినీతారల డ్రగ్స్ కేసు సర్వత్రా సంచలనం సృష్టించిన విష‌యం తెలిసిందే. ఈ డ్రగ్స్ కేసులో ఈడీ దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే అనేకమంది ప్రముఖుల పేర్లు ఈ కేసులో వెలుగులోకి వ‌చ్చాయి. అయితే, తాజాగా.. ముగ్గురు నుంచి సేకరించిన కీలక ఆధారాలతో 12 మంది నటులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ 12 మంది విచారణ పూర్తైన తర్వాత మరికొందరిపై దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. అంతేగాకుండా.. ఇప్పటివరకూ ఎక్సైజ్ శాఖ విచారించిన వారందరికీ నోటీసులు పంపే యోచనలో ఈడీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో మొత్తం 62 మందిని విచారించాలని ఈడీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. డ్రగ్స్ కేసులో మనీలాండరింగ్ జరిగిందని, ఫెమా నిబంధనలు ఉల్లంఘించి భారీగా విదేశాలకు నిధులు మళ్లించినట్లు ఈడీ గుర్తించింది.

Next Story

Most Viewed