ప్రజా ప్రతినిధులపై దాడికి పాల్పడిన టోల్ ప్లాజా నిర్వాహకులు

62
Toll plaza

దిశ, గుమ్మడిదల: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన టోల్ ప్లాజా వద్ద తరుచూ రాత్రి సమయంలో ఏదో ఒక వివాదం చోటు చేసుకుంటుంది. తాజాగా సాయంత్రం 7 గంటల సమయంలో టోల్ ప్లాజా నిర్వాహకులు మద్యం మత్తులో ప్రజా ప్రతినిధులపై దాడికి పాల్పడ్డారు.. వారికి పాస్ ఉందని తెలిపినప్పటికి డబ్బులు కట్టాలని డిమాండ్ చేశారన్నారు. టోల్ ప్లాజా నిర్వాహకులు మూకుమ్మడిగా ఒకేసారి నలుగురు దాడికి పాల్పడ్డారని కుర్చీలు, కర్రలతో దాడికి దిగారన్నారు. వారికి రక్తస్రావం కావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న స్థానిక జెడ్పిటిసి కుమార్ గౌడ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు విజయభాస్కర్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకొచ్చారు.

Toll plaza