నేటి రాశి ఫలితాలు (05-04-2021)

by  |
RasiPhalalu
X

మేషం

​ధన వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. పనులలో వ్యయప్రయాసలు తప్పవు. ఆస్థి వివాద చర్చల్లో విఫలమౌతాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. వ్యాపారమున నూతన సమస్యలు కలుగుతాయి. ఉద్యోగమున శ్రమాధిక్యత కలుగుతుంది.

వృషభం

వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. నూతన వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. నిరుద్యోగుల శ్రమకు తగిన అవకాశాలు లభిస్తాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు లాభిస్తాయి.ఆకస్మిక ధనయోగం ఉన్నది.

మిధునం

అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. నూతన వస్తు లాభాలను పొందుతారు. చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. వ్యాపారస్తులకు నూతన ప్రోత్సాహకాలు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన స్థానచలనాలు ఉంటాయి. విద్యార్థులకు ఒత్తిడి తొలగుతుంది.

కర్కాటకం

చేపట్టిన కార్యక్రమాలలో ఆటంకాలు కలుగుతాయి శ్రమతో కూడిన ప్రయాణాలు చేస్తారు. కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వ్యాపార ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఒత్తిడి అధికమవుతుంది.

సింహం

కుటుంబ సభ్యులతో అకారణ విభేదాలు కలుగుతాయి చేపట్టిన పనులలో జాప్యం కలిగినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ఆదాయం తగినంత కనిపించదు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది.

కన్య

ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సన్నిహితుల నుండి ధన సహాయం అందుతుంది. గృహమున శుభకార్య సంబంధిత ఖర్చులు కలుగుతాయి. దైవదర్శనం చేసుకుంటారు వ్యాపారాలలో ఊహించని లాభాలు అందుతాయి. ఉద్యోగంలో ఉన్నత పదవులు పొందుతారు.

తుల

దూర ప్రయాణాలులో మార్గ అవరోధాలు కలుగుతాయి వ్యాపారమున భాగస్థులతో మాటపట్టింపులు ఉంటాయి కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక అశాంతి కలుగుతుంది. ఉద్యోగ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది ఆర్ధిక నష్టాలుంటాయి.

వృశ్చికం

గృహమున శుభకార్యాల పై చర్చలు జరుగుతాయి. నూతన గృహం కొనుగోలు ప్రయత్నాలు ప్రారంభిస్తారు వృత్తి వ్యాపారాలలో ఊహించని అవకాశాలు లభిస్తాయి నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి.

ధనస్సు

సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగ విషయంలో సహోద్యోగుల సాయంతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు.

మకరం

ఆదాయ మార్గాలు తగ్గుతాయి.ముఖ్యమైన వ్యవహారాలలో జీవితభాగస్వామి సలహా స్వీకరించడం మంచిది. కుటుంబ సంభందిత వ్యవహారాలలో నిర్ణయాలు మార్చుకుంటారు. వృత్తి వ్యాపారాలు స్వల్ప లాభాలు అందుకుంటారు. ఉద్యోగమున ఆకస్మిక మార్పులు ఉంటాయి.

కుంభం

స్నేహితుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. నూతన వాహన యోగం ఉన్నది. నిరుద్యోగులు వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. వ్యాపారస్తులకు అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.

మీనం

చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి బంధు మిత్రులు నుండి ఋణ ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్య విషయాలలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. వ్యాపార వ్యవహారాలు నిదానంగా సాగుతాయి కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో పనికి తగిన గుర్తింపు లభించక నిరాశ కలిగిస్తాయి.

Next Story

Most Viewed