నేడు YSRTP భారీ బహిరంగ సభ.. షర్మిల ప్లాన్ హిట్టయ్యేనా.. ఫట్టయ్యేనా..

by  |
నేడు YSRTP భారీ బహిరంగ సభ.. షర్మిల ప్లాన్ హిట్టయ్యేనా.. ఫట్టయ్యేనా..
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో వైఎస్ఆర్‌టీపీ(YSRTP) ఆధ్వర్యంలో దళిత భేరి భారీ బహిరంగ సభ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభంకానుంది. ఈ సభకు ముఖ్య అతిథిగా పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల హాజరుకానున్నారు. పార్టీ ఏర్పాటు చేశాక జరుగుతున్న తొలి బహిరంగసభ కావడంతో భారీ జన సమీకరణ చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ శ్రేణులు సభకు భారీగా ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా దళితులకు కేసీఆర్ చేసిన అన్యాయంపై షర్మిల ప్రసంగించనున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు లోటస్ పాండ్ నుంచి భారీ కాన్వాయ్ తో షర్మిల తిరుమలగిరికి బయలుదేరనున్నారు. మొదటగా లోటస్ పాండ్ నుంచి ఉప్పల్ మీదగా జనగాం చేరుకుంటారు.

అక్కడి నుంచి కామారెడ్డి గూడెం, గొల్లపల్లి మీదగా తిరుమలగిరి సభా ప్రాంగణానికి షర్మిల రానున్నారు. దళితులకు కేసీఆర్ ఇస్తానన్న మూడెకరాల భూమి, దళిత ముఖ్యమంత్రి, దళిత ఉప ముఖ్యమంత్రుల తొలగింపు, దళిత బంధు, నిరుద్యోగుల ఆత్మహత్యలు, సబ్ ప్లాన్ నిధుల బదలాయింపు, మూడెకరాల భూమి, ఇప్పటివరకు దళితులపై జరిగిన 8,912 దాడులపై సుదీర్ఘంగా షర్మిల మాట్లాడనున్నారు. దళిత భేరి సక్సెస్ ద్వారా తెలంగాణ ప్రజానీకానికి మరింత చేరువవ్వాలని షర్మిల భావిస్తున్న తరుణంలో, ఈ సభకు ప్రత్యేకత ఏర్పడింది. ఈ సభ సక్సెస్ మీద ఆధారపడి పార్టీ భవితవ్యం ఉండనున్నట్టు రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.


Next Story

Most Viewed