నామినేషన్‌ ప్రక్రియకు నేడు తుది గడువు

8

దిశ, వెబ్‌డెస్క్: సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజవకర్గ ఉప ఎన్నికల నామినేషన్‌ ప్రక్రియకు నేడు చివరి తేదీ అని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. దీంతో నేటితో నామినేషన్ ప్రక్రియ ముగియనుంది. ఈ ఎన్నికల్లో పోటీచేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పటికే నామినేషన్‌ దాఖలు చేశారు. బుధవారం బీజేపీ, టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు నామినేషన్‌ పత్రాలను సమర్పించగా.. గురువారం కాంగ్రెస్‌ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి నామినేషన్‌ వేశారు. అయితే మెదక్ జిల్లాలోని దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామ‌లింగారెడ్డి ఇటీవల చనిపోవడంతో.. ఆ స్థానంలో ఉప ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.