Titan నుంచి స్మార్ట్ కళ్లజోడు.. ఆడియో, ఫోన్ కాల్ ఫీచర్

183
eye glasses

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ వాచ్ దిగ్గజం టైటాన్ కొత్త స్మార్ట్ కళ్ళజోడును విడుదల చేసింది. ఆడియో సపోర్ట్, ఫిట్‌నెస్ ట్రాకింగ్, ఇతర ఫీచర్లతో సహా టైటాన్ ఐఎక్స్ అనే పేరుతో తన మొదటి స్మార్ట్ కళ్ళజోడును లాంచ్ చేసింది. స్మార్ట్ గ్లాసెస్ బ్లూటూత్ వెర్షన్ 5.0తో ట్రూ-వైర్‌లెస్ (TWS), ఓపెన్ ఇయర్ స్పీకర్లు, CVC (క్లియర్ వాయిస్ క్యాప్చర్) టెక్నాలజీతో వస్తున్నాయి. దీన్ని మీ స్మార్ట్‌ఫోన్‌తో సులభంగా కనెక్ట్ చేయవచ్చు. దీనిలో టచ్ కంట్రోల్ ఆప్షన్ ఉంటుంది. దీనిని ఉపయోగించి కాల్‌లను లిఫ్ట్ చేయవచ్చు లేదా తిరస్కరించవచ్చు. మ్యూజిక్ మార్చవచ్చు. ఈ స్మార్ట్ కళ్లజోడు ఫిట్‌నెస్ కార్యకలాపాలను కూడా ట్రాక్ చేయగలదు. వాయిస్-ఎనేబుల్ ఐ కేర్ నోటిఫికేషన్‌లను పంపవచ్చు. CVC డైనమిక్ వాల్యూమ్ నియంత్రణతో స్పష్టమైన వాయిస్ నాణ్యత వస్తుంది. ఇది వాతావరణాన్ని బట్టి ఆడియో అవుట్‌పుట్ వాల్యూమ్‌ను సర్దుబాటు చేస్తుంది. దీనిని iOS, Android రెండింటిలోనూ అందుబాటులో ఉండే Titan యాప్‌ ద్వారా కనెక్ట్ చేయవచ్చు. ఒక్కసారి చార్జ్‌ చేస్తే 8 గంటల వరకు వినియోగించుకోవచ్చు. చార్జింగ్​ లేనట్లయితే ఎప్పటిలాగే ప్రిస్క్రిప్షన్​ కళ్లజోడుగా వాడుకోవచ్చని కంపెనీ తెలిపింది. దీని ధర రూ.9999. Titan Eye+ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది.