మనసున్న పోలీసు బాసు

by  |
మనసున్న పోలీసు బాసు
X

దిశ, ఏపీ బ్యూరో: తిరుపతి సమీపంలోని గాజుల మండ్యం పోలీసు స్టేషన్​ పరిధిలో ఓ యువతిపై లైంగిక దాడి జరిగింది. పేదరికంలో మగ్గుతున్న ఆమె కుటుంబం గురించి తెలుసుకున్న తిరుపతి అర్బన్​ఎస్పీ ఆవుల రమేష్​రెడ్డి రూ.25వేల సాయం అందించారు. నగదును డీఎస్పీ ద్వారా పంపారు. రమేష్​రెడ్డి గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంది. ఆయన దయాగుణానికి మారుపేరులా ఉంటారు. పోలీసు కాఠిన్యం కన్నా ఆర్థ్రతతో స్పందించే తత్వం ఆయనకే సొంతం. ఎక్కడ ఏం జరిగినా తనకు అయ్యో పాపం అనిపిస్తే ఎగబడి సాయం చేస్తుంటారు. అదెంతో ఆయనకు తృప్తినిస్తుంది. ఇప్పటికీ ఆయన జీతంలో సగం పేద పిల్లల చదువుల కోసం వెచ్చిస్తున్నారంటే.. రియల్లీ హ్యాట్స్​ ఆఫ్​ టు యూ సర్!


Next Story

Most Viewed