మళ్లీ మమతానా?.. కమలం వికసిస్తుందా?

by  |
మళ్లీ మమతానా?.. కమలం వికసిస్తుందా?
X

దిశ వెబ్‌డెస్క్: ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో(తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్, పుదుచ్చేరి, అసోం) జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారాయి. ఐదు రాష్ట్రాల్లో ఏ పార్టీ గెలుస్తుందనే విషయంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. పెట్రోల్ ధరల పెంపు, వంటగ్యాస్ ధరల పెంపు, దేశ రాజధాని ఢిల్లీలో దేశంలోని రైతులు చేస్తున్న ఆందోళనల ప్రభావం ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీపై పడుతుందా?.. లేదా? అనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. వీటిని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి మోదీ ప్రభుత్వంపై విమర్శలు చేసిన ప్రతిపక్ష పార్టీలకు ఇది ఎంతవరకు కలిసొస్తుందనేది కూడా చర్చనీయాంశంగా మారింది.

ఐదు రాష్ట్రాల ఎన్నికలపై పలు మీడియా సంస్థలు నిర్వహిస్తున్న సర్వేలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. తాజాగా పశ్చిమబెంగాల్ ఎన్నికలపై టైమ్స్ నౌ-సీ ఓటర్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో పశ్చిమబెంగాల్‌ పీఠం మళ్లీ మమతాదే అని తేలింది. పశ్చిమబెంగాల్‌లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. అధికార టీఎంసీ 154 స్థానాల్లో గెలుస్తుందని టైమ్స్ నౌ-సీ ఓటర్ సర్వే అంచనా వేసింది.

ఇక బీజేపీకి 107 స్థానాలు వస్తాయని, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు 33 స్థానాలు గెలుచుకునే అవకాశముందని అంచనా వేసింది. ఇక హైదరాబాద్‌కి చెందిన పీపుల్స్ పల్స్ సంస్థ నిర్వహించిన సర్వేలో బీజేపీది అధికారం అని తేలింది. బీజేపీకి 160 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. సర్వేలను నమ్మడానికి లేదు. మరి చూడాలి పశ్చిమబెంగాల్‌లో అధికారం ఎవరిదో?

Next Story

Most Viewed