చిన్నారి ఆపరేషన్‌ కోసం.. న్యూజిలాండ్ పేసర్ కీలక నిర్ణయం

by  |
Tim southee
X

దిశ, స్పోర్ట్స్: న్యూజిలాండ్ పేసర్ టిమ్ సౌథీ తన మంచి మనసును చాటుకున్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో తాను ధరించిన జెర్సీని ఒక చిన్నారి చికిత్స కోసం వేలం వేయాలని నిర్ణయించాడు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న 8 ఏళ్ల చిన్నారి వైద్యం కోసం తన జెర్సీని అమ్మాకానికి పెట్టాడు. హోలీ బీటి అనే చిన్నారి న్యూరో బ్లాస్టోమా అనే అరుదైన క్యాన్సర్‌తో బాధపడుతున్నది. హోలీ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న టిమ్ సౌథీ.. తన జెర్సీపై టీమ్ ఆటగాళ్లందరితో సంతకాలు చేయించి వేలానికి పెట్టాడు. తాను ధరించిన జెర్సీ మరొకరికి ఉపయోగపడటం నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నది. జులై 8 వరకు బిడ్డింగ్ ఓపెన్‌లో ఉంచుతాము. అప్పటి వరకు ఎవరైనా బిడ్లు వేయవచ్చు. ఇపపటి వరకు 152 బిడ్లు రాగా.. వాటిలో ఒక బిడ్ 7వేల డాలర్లు చెల్లిస్తామని వచ్చింది. ఇంకా భారీ మొత్తం వస్తుందని తాను ఆశిస్తున్నానని సౌథీ పేర్కొన్నాడు. కాగా, జూన్ 18 నుంచి 23 వరకు జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్‌లో న్యూజిలాండ్ జట్టు టీమ్ ఇండియాపై 8 వికెట్ల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే.

Next Story

Most Viewed