టిక్‌టాక్ కొత్త బిజినెస్ ప్లాన్

by  |
టిక్‌టాక్ కొత్త బిజినెస్ ప్లాన్
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో చైనాకు చెందిన టిక్‌టాక్ యాప్‌ను నిషేధించడంతో టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌ చైనా ఇమేజ్‌ను తొలగించుకోవాలని భావిస్తోంది. దీనికోసం టిక్‌టాక్ ప్రధాన కార్యాలయాన్ని బీజింగ్ నుంచి తరలించడానికి సిద్ధమవుతోంది. టిక్‌టాక్ కార్యకలాపాలకు చైనాతో సంబంధం తొలగించుకుంటే అంతర్జాతీయ మార్కెట్లో ఆటంకాలు ఉండవని భావిస్తోంది. ఇందులో భాగంగా కొత్త కార్యనిర్వాహక బోర్డును ఏర్పాటు చేయాలని బైట్‌డ్యాన్స్ భావిస్తున్నట్టు, ఈ అంశంపై బైట్‌డ్యాన్స్‌లోని సీనియర్ ఎగ్జుక్యూటివ్స్ చర్చలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.

భారత్‌లో టిక్‌టాక్ నిషేధం కారణంగా కోట్ల మంది యూజర్లను కోల్పోవడంతో బైట్‌డ్యాన్స్ భారీ నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇటీవల అగ్రరాజ్యం అమెరికా కూడా దీన్ని నిషేధించే పనిలో ఉన్నట్టు వార్తలొచ్చాయి. దీంతో టిక్‌టాక్ చైనాకు చెందిన యాప్ అయినప్పటికీ, ఎప్పుడూ పక్షపాతంగా వ్యవహరించలేదని, వేరే దేశాల్లోని పౌరుల డేటాను చైనాకు ఇవ్వలేదని ఆరోపణలను అధిగమించే ప్రయత్నాలు చేసింది. ఒకవేళ అమెరికా కూడా నిషేధం ప్రకటిస్తే టిక్‌టాక్ యాప్ మనుగడకే ప్రమాదం తప్పదనే అంచనాలతో బైట్‌డ్యాన్స్ కొత్త వ్యూహానికి, మార్పులకు సిద్ధమవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.



Next Story

Most Viewed