కొమురం భీం జిల్లాలో మరోసారి పులి కలకలం

by  |
కొమురం భీం జిల్లాలో మరోసారి పులి కలకలం
X

దిశ, వెబ్‌డెస్క్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మరోసారి పులి కలకలం రేపింది. రుద్రారం దగ్గర అక్కడ పనిచేసే రైతులకు పెద్దపులి కనిపించింది. పులి తారసపడడంతో రైతులు భయంతో పరుగులు తీశారు. అనంతరం ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. అటవీశాఖ అధికారులు త్వరితగతిన పులిని బంధించాల్సిందిగా ప్రజలు కోరుకుంటున్నారు. మరోవైపు పులి దాడి ఘటనలో బాధితులను పరామర్శించేందుకు జిల్లాలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటిస్తున్నారు.

Next Story

Most Viewed