గాండ్రింపు మరిచి కూనిరాగాలు తీస్తున్న ‘పులి’

by  |
గాండ్రింపు మరిచి కూనిరాగాలు తీస్తున్న ‘పులి’
X

దిశ, ఫీచర్స్ : సాధారణంగా టైగర్ అనగానే అందరం భయపడుతుంటాం. భయంకరమైన దాని గర్జనకు తోడు ఎక్కడ మనపై దాడి చేసి చంపేస్తుందో అని హడలిపోతాం. అయితే మనం చెప్పుకోబోయే ఈ టైగర్ ‘ఫియరీ సౌండ్’ చేయట్లేదు. సంగీత సాధనకు బయలుదేరిన గాయకుని వలె కూనిరాగాలతో సాఫ్ట్ మెలోడిక్ సౌండ్స్ చేస్తూ పలువురిని ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఆ మ్యూజికల్ సెన్స్ ఉన్న టైగర్ ఎక్కడుందంటే..

రష్యాలోని సెర్బియన్ సిటీ జూలో ఉన్న ఎనిమిది నెలల ‘షెర్హాన్’ అనే టైగర్‌కు సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. అది చేసే సంగీత ధ్వనులకు మ్యూజిక్ లవర్స్ ఫిదా అవుతున్నారు. అయితే ఈ టైగర్ చేసే సంగీత ధ్వనులు ఏడ్చినట్లు ఉన్నాయని, అది ఏదైనా సమస్యతో బాధపడుతుందేమోనని పలువురు అభిప్రాయపడుతుండగా.. అదేమీ లేదని జూ సిబ్బంది సమాధానమిచ్చింది. ఈ మేల్ టైగర్‌కు ఎలాంటి పెయిన్ లేదని, అందరినీ తన వైపునకు ఆకర్షించేందుకే ఇలా హై పిచ్ సౌండ్స్ చేస్తోందని వారు వివరించారు. టైగర్ మ్యూజికల్ సౌండ్స్ చేసే వీడియోను రష్యా న్యూస్ ఏజెన్సీ రూటర్స్(Reuters) ట్విట్టర్ వేదికగా షేర్ చేయగా.. నెటిజన్లు ఆ వీడియో చూసి ఆనందపడుతున్నారు. ‘టైగర్ విత్ సోల్ ఆఫ్ బర్డ్, క్యూట్‌నెస్‌తో టైగర్ హ్యాపీగా మ్యూజిక్ కంపోజ్ చేస్తోందని’ కామెంట్లు చేస్తున్నారు.


Next Story

Most Viewed