నిందితుల ఇళ్లకు నిప్పు అంటించారు.. కారణం అదేనా

68
fire to houses

దిశ, సికింద్రాబాద్: ఓ వ్యక్తి హత్యకు ఆగ్రహించిన బంధువులు.. నిందితులకు చెందిన రెండు ఇళ్లపై దాడి చేసి నిప్పు పెట్టిన సంఘటన లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళ్లితే.. లాలాగూడ పరిధిలో జరిగిన ఆటో డ్రైవర్ రాజేష్ అలియాస్ రాజు హత్యకు ఆగ్రహించిన అతని బంధువులు నిందితులకు చెందిన రెండు ఇళ్లపై దాడి చేసి నిప్పుపెట్టారు. దీంతో ఇంట్లో ఉన్న పలు విలువైన వస్తువులు కాలి బూడిదయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు భారీ సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకొని పైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు. దీంతో ఫైర్ సిబ్బంది మంటలార్పేందుకు ప్రయత్నించారు.

కానీ అప్పటికే విలువైన నిత్యావసర వస్తువులు, దుస్తువులు, అలమార, నగదు, బంగారం తో పాటు ఇళ్లు కూడా కాలిపోయాయి. రమేష్ , వెంకటేష్‌లకు చెందిన ఇండ్లు ద్వంసం అయ్యాయి. బాదితులైన రమేష్, వెంకటేష్ మాట్లాడుతూ.. తమ ఇండ్లు , వస్తువులకు నిప్పుపెట్టారని దీంతో తాము పిల్లాపాపలతో రోడ్డున పడ్డామన్నారు. తమకు ప్రాణ హాని ఉందని పోలీసులు రక్షణ కల్పించాలని కోరారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.