మధ్యాహ్నభోజనంలో అపశృతి.. చిన్నారి మృతి

by  |
మధ్యాహ్నభోజనంలో అపశృతి.. చిన్నారి మృతి
X

పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండుతున్న పాత్రలో ప్రమాదవశాత్తు ఓ చిన్నారి పడి మృతి చెందింది. ఈ విషాదకర ఘటన ఉత్తరప్రదేశ్ లోని మిర్జాపూర్ జిల్లా లాలాగంజీ ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాంపూర్ అటారి ప్రాథమిక పాఠశాలకు అనుబంధంగా అంగన్వాడి కేంద్రం ఉంది. ఆ కేంద్రానికి వచ్చిన ఓ మూడేండ్ల చిన్నారి ఆడుకుంటూ.. వంటలు చేసే ప్రదేశానికి వచ్చింది. అప్పటికే అక్కడ మధ్యాహ్న భోజనం సిద్ధం చేస్తున్నారు. ఈ సమయంలో ఆ చిన్నారి ప్రమాదవశాత్తు మరుగుతున్న పాత్రలో పడిపోయింది. గమనించిన సిబ్బంది వెంటనే సమీప ఆస్పత్రికి తరలించగా, సదరు చిన్నారి అప్పటికే మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారు. కాగా, తమ చిన్నారి మృతికి అక్కడి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రమాదం సమయంలో వంట చేస్తున్న వ్యక్తి ఎయిర్ ఫోన్స్ పెట్టకుని, పాటలు వింటున్నాడని ఆరోపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నపోలీసులు విచారణ చేపట్టారు.

Next Story

Most Viewed