గణపతి విగ్రహాన్ని మింగేసిన బుడ్డోడు.. వైరల్!

by  |
ganapathi-statue
X

దిశ, వెబ్‌డెస్క్ : పిల్లలు ఆడుకునే సమయంలో చేతికి ఏ వస్తువు దొరికినా నోట్లో పెట్టుకోవడం వారికి అలవాటే. పెద్దలు ఎవరైనా వెంటనే గుర్తించకపోతే అలాగే ఆడుకుంటూ తినేస్తారు. పెద్ద సైజులో ఉన్న ఆటవస్తువులైతే ప్రమాదమేమీ ఉండకపోవచ్చు. కానీ, నోట్లోకి వెళ్లేంత సైజులో ఉండే వస్తువులను మాత్రం తల్లిదండ్రులు చిన్నారులకు దూరంగా ఉంచడమే చాలా బెటర్ అని వైద్యులు సూచిస్తున్నారు.

ఎందుకంటే కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో మూడేళ్ల వయస్సున్న బాలుడు ఆడుకుంటూ గణపతి విగ్రహాన్ని మింగేసాడు. అది సుమారు 5 సెంటీమీటర్ల పొడవు ఉంటుందని సమాచారం. గొంతులోకి వెళ్లాక బాలుడు తీవ్రంగా ఏడుస్తుండటాన్ని గమనించిన పేరెంట్స్ బెంగళూరు ఓల్డ్ ఎయిర్‌పోర్ట్ రోడ్‌లోని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు.

పరీక్షించిన వైద్యులు కొత్త సాంకేతికత పరికరాల సాయంతో చాకచక్యంగా విగ్రహాన్ని బయటకు తీశారు. అనంతరం పీడియాట్రిక్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శ్రీకాంత్ కెపీ మాట్లాడుతూ.. గణపతి విగ్రహం బాలుడి అన్నవాహికకు గాయం కలిగించిందని, ఛాతిలో ఇన్ఫెక్షన్ కూడా అయ్యిందని తెలిపారు.



Next Story

Most Viewed