ఒమిక్రాన్ టెన్షన్.. దేశంలో పెరుగుతున్న పాజిటివ్ కేసులు

by Anukaran |
ఒమిక్రాన్ టెన్షన్.. దేశంలో పెరుగుతున్న పాజిటివ్ కేసులు
X

దిశ, డైనమిక్ బ్యూరో : దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గుజరాత్ రాష్ట్రంలో ఒక ఒమిక్రాన్ కేసు నమోదైనట్లు కేంద్రం వెల్లడించింది. కరోనా సోకిన వ్యక్తి సౌతాఫ్రికా నుంచి వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య మూడుకి చేరింది. కర్ణాటక రాష్ట్రంలో ఇప్పటికే రెండు ఒమిక్రాన్ కేసులు నమోదైన విషయం తెలిసిందే.

ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా ఒమిక్రాన్ వేరియంట్ భారత్‌లోకి అడుగుపెట్టిన క్రమంలో ఆంక్షలు కేంద్రం తీసుకొచ్చింది. అయితే, ఇప్పటికే విదేశాల నుంచి వచ్చిన వారికి టెస్టులు చేయగా అందులో కొంత మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ క్రమంలో వారి శాంపుల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ టెస్టెంగ్‌కు పంపించారు.

Next Story

Most Viewed