ఈ ఏడాది మాది కాదు: ధోని

by  |
ఈ ఏడాది మాది కాదు: ధోని
X

దిశ, వెబ్‌డెస్క: ఐపీఎల్ 13వ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మరో ఓటమి ముటగట్టుకున్న సంగతి తెలిసిందే. గతేడాది రన్నరప్‌గా ఉండి డిఫెండింగ్ చాంపియన్‌ ముంబై‌ జట్టుకు గట్టి పోటీనిచ్చినా చెన్నై ఈ ఏడాది కనీసం ప్లే ఆఫ్స్‌ దరిలోకి కూడా రాలేకపోతోంది. ఈ సీజన్‌లో మొత్తం 11 మ్యాచుల్లో కేవలం 3 మ్యాచుల్లోనే విజయం సాధించగా.. 8 మ్యాచుల్లో ఘోర పరాజయాలను ముటగట్టుకుంది. దీనికి తోడు ముంబైతో జరిగిన ఐపీఎల్ 41 మ్యాచ్‌లో అయితే ప్రత్యర్థి జట్టులో ఒక్క వికెట్ కూడా తీయలేక తోకముడిచింది. ఇక మైదానం నుంచి చెన్నై సింహాలు వెనుదిరగడంతో అభిమానులు తీవ్ర నిరుత్సాహంలో పడ్డారు.

మ్యాచ్ అనంతరం మాట్లాడిన ధోని చాలా నిరాశ వ్యక్తి పరిచాడు. ముంబై‌తో జరిగిన మ్యాచ్ చాలా బాధించింన్నాడు. ఈ సంవత్సరం మా సంవత్సరం కాదని చెప్పిన ధోని.. వరుస ఓటములతో జట్టు ఆటగాళ్లు చాలా బాధపడుతున్నారని చెప్పాడు. అయినా.. ఈ సీజన్‌లో వారి వంతు ప్రయత్నం చేశారని.. ప్రస్తుతం ఉన్న సామర్థ్యలను బట్టి ఆడుతున్నామనేదే ప్రధాన విషయమన్నాడు. ఇక ఓపెనర్ల పై ఒత్తిడి పెరగడంతో జట్టు ఓటమి చవిచూసిందన్న ధోని.. మిడిలార్డర్‌ విభాగం రాణించడం కష్టతరం అయిందని చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ చరిత్రలో సీఎస్కే జట్టు ఇప్పటివరకు మూడు సార్లు టైటిల్ కొట్టిన సంగతి తెలిసిందే. అటువంటి జట్టు ఈ సీజన్‌లో రాణించకపోవడం గమనార్హం. 2010, 2011, 2018 సీజన్‌లల్లో ధోని సారథ్యంలోనే ఐపీఎల్ కప్పు ఎగరేసుకుపోయింది. అయితే ఈ సీజన్‌లో మరో మూడు మ్యాచుల ఆడాల్సి ఉందని ధోని గుర్తు చేశాడు.

Next Story

Most Viewed