కుండ పిజ్జా టేస్ట్ చేస్తారా!

by  |
Kulhad Pizza
X

దిశ, ఫీచర్స్ : ఇటాలియన్ వంటకమైన పిజ్జాను టమోటాలు, జున్ను ఇతరత్రా ఆహార పదార్థాలతో పులియబెట్టిన గోధుమ పిండిని కలిపి తయారుచేస్తారు. ఇటలీ నుంచి ప్రపంచ దేశాలకు విస్తరించిన ఈ పిజ్జా.. ప్రస్తుతం బిలియన్ల మంది ఫేవరెట్‌ డిష్‌గా ఆదరణ పొందుతోంది. పిజ్జాల్లోనూ ఎన్నో రకాలు అందుబాటులోకి రాగా, తాజాగా ‘కుల్లడ్ పిజ్జా’ సూరత్ వాసుల నోరూరిస్తోంది. ఇప్పటివరకు కుండ బిర్యానీ, కుండ చికెన్ మాత్రమే మనం రుచి చూశాం. త్వరలోనే ‘కుండ పిజ్జా’ కూడా అన్ని నగరాల్లోకి విస్తరించనుంది. ఓవెన్‌లో తయారయ్యే పిజ్జాకు దేశీ స్టైల్ టచ్ ఇచ్చిన సూరత్ పిజ్జా మేకర్స్.. చిన్న మ‌ట్టి క‌ప్పులో అదిరిపోయే పిజ్జాను త‌యారు చేస్తున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

ముంబైకి చెందిన ఆమ్చి అనే యూట్యూబ్ చానల్ మార్చిలో పోస్ట్ చేసిన పిజ్జా మేకింగ్‌ వీడియో దాదాపు 23 లక్షల వ్యూస్‌తో దూసుకుపోతుండగా నెటిజన్లు ప్రస్తుతం దీని గురించి ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఇక వీడియో విషయానికొస్తే, కుల్లడ్ పిజ్జా తయారీకి మొదట మిశ్రమాన్ని సిద్ధం చేసుకున్న వ్యక్తి.. ఒక గిన్నెలో మయోన్నైస్ టమోటా కెచప్ వంటి అనేక సాస్‌లతో పాటు ఉడికించిన మొక్కజొన్న, తరిగిన టమోటాలు, పనీర్ క్యూబ్‌లను జోడించాడు. రుచి కోసం ఆ మిశ్రమానికి మిర్చి, ఒరేగానో, ఉప్పు, చాట్ మసాలాను కలిపాడు. ఈ మిశ్రమాన్ని చిన్నపాటి కుండలో నింపి సాస్, లిక్విడ్ చీజ్‌తో గార్నిష్ చేశాడు. ఆ తర్వాత జున్నుతో పాటు మరికొన్ని ఇన్‌గ్రీడియంట్స్ జోడించి కుల్లాడ్‌ను మైక్రోవేవ్‌లో ఉంచాడు. అంతే కుల్లాడ్ పిజ్జా రెడీ.


Next Story