కార్లకు కొత్త జీవం పోస్తున్న భారత్‌మొబీ

by  |
కార్లకు కొత్త జీవం పోస్తున్న భారత్‌మొబీ
X

దిశ, వెబ్‌డెస్క్:

భారతదేశంలో వాహనదారులకు ఇప్పుడు ప్రధానంగా ఉన్న సమస్యలు మూడు. ఒకటి గాలి కాలుష్యం, రెండు ట్రాఫిక్ రద్దీ, మూడు పాత వాహనాలను నాశనం చేయగల అవస్థాపనా సౌకర్యాలు. ఈ మూడింటికి కలిపి భారత్‌మొబీ అనే స్టార్టప్ స్థాపకులు ఓ పరిష్కారం కనిపెట్టారు. పెట్రోల్, డీజిల్‌తో నడిచే కార్లను ఎలక్ట్రిసిటీతో నడిచే కార్లుగా మార్చి వాటికి కొత్త జీవం పోయడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సాయం చేస్తున్నారు. హైదరాబాద్ తమ కంపెనీ ఏర్పాటు చేసిన అక్బర్ బైగ్, అశ్శర్ అహ్మద్ షేక్‌లు తమ ఈవీ రెట్రో ఫిట్టింగ్ లేదా కన్వర్షన్ టెక్నాలజీతో భారతదేశాన్ని కాలుష్య రహిత దేశంగా మార్చబోతున్నారు.

ఇదెలా పనిచేస్తుంది?

సెడాన్లు, హ్యాచ్‌బ్యాకులకు తగ్గట్లుగా వారు భారత్ కిట్లను రూపొందించారు. ఒక్కసారి కన్వర్ట్ చేశాక వీరు అమర్చిన బ్యాటరీ 80 కి.మీ.ల వరకు ఛార్జింగ్ అందజేస్తుంది. అది కూడా 80 కి.మీ.ల వేగంతో వెళ్తూ ఏసీ కూడా ఆన్ చేసుకోవచ్చు. అంతేకాకుండా కారును బట్టి కస్టమైజ్డ్ భారత్ కిట్స్‌ని కూడా వీరు అమరుస్తారు. దీంతో ఒక్క చుక్క ఇంధనం లేకుండా కారు నడుపుకోవచ్చు. మారుతి ఆల్టో, వేగనార్, స్విఫ్ట్ డిజైర్ కార్లను ఎలక్ట్రిక్ కార్లుగా మార్చడానికి వీరికి ఐక్యాట్ సర్టిఫికేషన్ కూడా ఉంది. ఒక్క కారును కన్వర్ట్ చేయడానికి రూ. 5 లక్షలు అవుతుంది. కేవలం ఎలక్ట్రిక్ కారుగా మార్చడమే కాకుండా బ్యాటరీ వేడి, సెల్ వేడి, వాహన హెల్త్ స్టేటస్‌ని కూడా మానిటర్ చేసే టెలిమెట్రిక్ సిస్టంని ఇన్‌స్టాల్ చేసి ఇస్తారు.

ఉపయోగాలేంటి?

ముఖ్యంగా పర్యావరణ సమస్య తగ్గుతుంది. అలాగే పాత పెట్రోల్, డీజిల్ వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చడం వల్ల కొత్త వాహనాల కొనుగోలు తగ్గుతుంది. తద్వారా రోడ్ల మీద వాహనాల రద్దీ తగ్గుతుంది. ఇక దేశంలో ఎలాగూ పాత వాహనాలను రీసైకిల్ కానీ, స్క్రేపింగ్ కానీ చేసే అవస్థాపనా సౌకర్యాలు లేవు కాబట్టి వాహన జీవితకాలాన్ని పెంపొందించే అవకాశం ఈ భారత్ కిట్ల ద్వారా కలుగుతుందని అక్బర్, అశ్శర్ తెలిపారు.

Read Also..

‘‘మిడ్ డే ఎగ్ అండ్ ఫ్రూట్స్’’

Next Story

Most Viewed