ఆ తెగలో జీరో సెక్స్ క్రైమ్స్.. అలాంటి ఆచారాలే కారణమట !

by  |
tribal
X

దిశ, ఫీచర్స్ : దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న అత్యాచార ఘటనలతో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. మైనర్ బాలికలు, పసిపిల్లలపైనా మానవ మృగాల లైంగికదాడులు సొసైటీని తలదించుకునేలా చేస్తున్నాయి. భారత్‌లో మహిళలపై క్రైమ్ రేటు పట్ల అంతర్జాతీయ సమాజం కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొనగా.. ఛత్తీస్‌గఢ్‌లోని ‘బైసన్-హార్న్ మురియాస్’ అనే గిరిజన తెగలో లైంగిక నేరాలు లేకపోవడం విశేషం. ప్రాచీన సంప్రదాయాలను పాటించడం వల్లే ఇక్కడ సెక్స్ క్రైమ్స్ లేవని స్థానికులు వెల్లడిస్తున్నారు.

tribes

‘బస్తర్’ ప్రాంతం భారతీయ గిరిజన సంస్కృతితో పాటు ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఎన్నో గిరిజన జాతులకు నిలయంగా ఉంది. కాగా మురియాస్‌ గిరిజనుల్లో ‘ఘోతుల్’ అనే ప్రత్యేకమైన సంప్రదాయం ఉంది. ఫిజికల్ ఎడ్యుకేషన్, స్కిల్ ట్రైనింగ్, సెక్స్ అవేర్‌నెస్‌తో పాటు అపరిమిత స్వేచ్ఛ ఇందులో భాగం. ఇక వీరిని మిగతా సమాజాలకు భిన్నంగా నిలబెట్టింది మాత్రం వారి ప్రగతిశీల లైంగిక ఆచారాలే. వివాహానికి ముందు లైంగిక సంబంధాలపై ఇక్కడ నిషేధం లేదు. జాకెట్స్ ధరించని మహిళలు, పురుషులు తమ సంప్రదాయ నృత్యం చేస్తూ ఒకరినొకరు లైంగికంగా ఆటపట్టించుకుంటారు. ఇక్క ఎవరికీ దేని గురించి పట్టింపు ఉండదు. ఎవరైనా నేరం చేస్తారనే ప్రశ్నే ఉత్పన్నం కాదు.

గోండల్ తెగ సమూహంలో భాగంగా, వారు దక్షిణ-మధ్య భారతదేశం అంతటా విస్తరించారు. ‘తల్లాగుల్లా’ అని పిలువబడే ఒక విలక్షణమైన తలపాగా నుంచి ఈ తెగ పేరు తీసుకోబడింది. ఇది మనుబోతు కొమ్ములు, నెమలి ఈకలతో అలంకరించబడుతుంది. తాము భూతల్లి బిడ్డలమని బైసన్ హార్న్ మరియా గిరిజనుల నమ్మకం. వారు అనుసరించే పద్ధతుల వల్లే అక్కడ లైంగిక నేరాలు నమోదు కావడం లేదు. వివాహేతర పవిత్రతను పట్టించుకోక పోవడంతో పాటు వివాహానికి ముందు అనుకూలతను గుర్తించడానికి ప్రీమారిటల్ సెక్స్ అవసరమనేది వారి నమ్మకం. వివాహం, సంతానోత్పత్తి, సెక్స్‌కు సంబంధించి పాటిస్తున్న సంప్రదాయాలే ఆ తెగ లైంగిక నేరాలకు దూరంగా ఉండేందుకు సాయపడుతోంది. ఈ విధానాలను అన్ని రకాల సమాజాలు అడాప్ట్ చేసుకుంటే లైంగిక నేరాలు అదుపులో ఉంటాయని, ‘నిజానికి మన సమాజంలోని మహిళలకు ఇది అవసరమైన పురోగతి’ అనేది పలువురు ఆధునికవాదుల అభిప్రాయం.

girijana

‘పురుషుల్లో లైంగిక నిరాశ లేదు. ప్రతీ ఒక్కరు ప్రేమలో పడటం లేదా దాని నుంచి బయటపడటం ఈ తెగలో కామన్. వివాహాలు పవిత్రమైనవి కావు. ఎందుకంటే ఈ వ్యవస్థను సృష్టించిన మనుషులు తాము పవిత్రులు కారు’ అని విశ్వసించే మురియాస్ తెగ.. ఆధునిక ప్రపంచంలో ప్రీమారిటల్ సెక్స్, వితంతు పునర్వివాహాన్ని సాధారణీకరించాలని నమ్ముతోంది.


Next Story

Most Viewed