ప్లే కార్డులు ఆడుతున్న జూదరులు అరెస్ట్..

86
judam

దిశ, శేరిలింగంపల్లి : ప్లే కార్డులు ఆడుతున్న 13 మంది జూదరులను అరెస్ట్ చేశారు ఎస్ ఓటీ పోలీసులు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలోని మణికొండ ప్రిస్టిన్ కమ్యూన్ లో సీజే నీరజ్ కుమార్, సీజే రమణ అనే వ్యక్తులు గత కొంతకాలంగా జూదశాలతో పాటు ఇల్లీగల్ గేమింగ్ నిర్వహిస్తున్నారన్న సమాచారంతో దాడులు చేసిన మాదాపూర్ జోన్ ఎస్ ఓటీ పోలీసులు 13 మంది జూదగాళ్లను అరెస్టు చేసి గేమింగ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు.

వారి వద్ద నుండి రూ.8600 నగదుతో పాటు నిర్వాహకుల బ్యాంక్ అకౌంట్ లోని రూ. కోటి 80 లక్షలను ఫ్రీజ్ చేశారు. వారి వద్ద నుండి 19 మొబైల్ ఫోన్‌ లు, 493నాణేలు, ఒక పోకర్ ప్లేయింగ్ బోర్డు, 3 పోకర్ కార్డ్ గార్డ్, 8 సెట్ల ప్లే కార్డులు, 6 కార్లు, ఐదు ఐడ్ జాక్ కార్డ్స్ లను కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..