గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్.. మూడో వంతు కరిగిన అట్లాంటిక్ హిమానీనదం

by  |
గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్.. మూడో వంతు కరిగిన అట్లాంటిక్ హిమానీనదం
X

దిశ, ఫీచర్స్ : గ్లోబల్ వార్మింగ్ పెరగడం వల్ల ఎండలు పెరిగి మంచుకొండలు, హిమానీనదాలు కరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే గ్లోబల్ వార్మింగ్‌ను ఆపడం మన చేతిలో లేదని తాజా అధ్యయనాన్ని బట్టి అంచనా వేయొచ్చు. అంటార్కిటిక్ ద్వీపకల్ప సమీపంలోని మంచులో మూడో వంతు కరిగిపోయినట్లు జియోఫిజికల్ రీసెర్చ్ లెటర్స్ జర్నల్‌లో ప్రచురితమైన స్టడీ పేర్కొంది. అంటార్కిటిక్ హిమానీనదం వేగంగా కరిగిపోతోందని ధ్రువీకరించింది. ధ్రువాల వద్ద ద్వీపకల్పంలో మంచు గడ్డలు కరగడం వల్ల గురుత్వాకర్షణ తలంలో మార్పులు వస్తాయని, ఇలా కరిగిపోవడం వల్ల అసాధారణ స్థాయిలో సముద్ర మట్టాలు పెరుగుతాయని, తద్వారా ఊహించని పరిణామాలు సంభవించే అవకాశముందని బ్రిటన్ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

అంటార్కిటిక్ ద్వీపకల్పంలోని అతిపెద్ద మంచుకొండ ‘లార్సెన్ సీ’ వేగంగా కరిగిపోతున్నట్లు తాము గుర్తించామని బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్ పరిశోధకులు తెలిపారు. ఐస్‌క్యాప్ నిరంతరంగా తగ్గుతోందే తప్ప, కొద్ది శాతమైనా పెరుగుదల లేదని వారు పేర్కొన్నారు. పరిస్థితులు ఇలానే కొనసాగితే రాబోయే దశాబ్దంలో అంటార్కిటిక్ మంచుకొండలు కరిగిపోవడం ఖాయమని రీసెర్చర్ గిల్బర్ట్ వెల్లడించారు. గ్లోబల్ వార్మింగ్‌కు కారణమయ్యే వాయువుల విపరీతంగా పెరుగుతున్నాయని.. శిలాజ ఇంధనాలు, ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయం కనుగొనడమే ప్రస్తుతం ప్రపంచం ముందున్న సవాల్ అని చెప్పారు.


Next Story

Most Viewed