హయత్ నగర్ గేటెడ్ కమ్యూనిటీలో దొంగల బీభత్సం

by Aamani |
హయత్ నగర్ గేటెడ్  కమ్యూనిటీలో దొంగల బీభత్సం
X

దిశ,ఎల్బీనగర్: గేటెడ్ కమ్యూనిటీ లో ఫినిషింగ్ వైర్ కట్ చేసి దొంగతనానికి పాల్పడి ఒకరు ఇంట్లో నగదు నగలను సత్కరించిన సంఘటన హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజా గుల్మహార్ గ్రేటర్ కమ్యూనిటీలో సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గ్రేటర్ పరిధి లోకి ఇతరులు రాకుండా ఉండేందుకు ఏర్పాటు చేసుకున్నటువంటి ఫెన్సింగ్ వైర్ ను కట్ చేసి గణేష్ సింగ్ ఇంట్లోకి చొరబడి ఇంట్లో ఉన్నటువంటి 30 తులాల వెండి అభరణాలను నగదును తస్కరించుకొని వెళుతుండగా పక్క ఇంటి వారు దొంగల కదలికలను కనిపెట్టిన కాలనీవాసులు అప్రమత్తం కావడంతో దొంగలు పరుగులు తీశారు. మంగళవారం ఉదయం బాధితుడు గణేష్ సింగ్ హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో బాధితుల ఫిర్యాదు మేరకు హయత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

కాలనీ వాసులు అప్రమత్తం కావడంతో పరుగులు తీసిన దొంగలు..

దొంగతనానికి పాల్పడి నగలు నగదు విలువైన వస్తువులను తస్కరించాలని ప్రయత్నంతో గ్రేటర్ కమ్యూనిటీ చుట్టూ ఉన్నటువంటి ఫెన్సింగ్ వైర్ కట్ చేసి దొంగతనం పాల్పడిన దొంగలు ఒకరి ఇంట్లో దొంగతనానికి పాల్పడుతుండగా అప్రమత్తమైన కాలనీవాసు లను గమనించి దొంగలు పరుగులు తీశారు. కాలనీవాసుల అప్రమత్తం కానీ ఎడల మరి కొన్ని ఇండ్లలో దొంగలు దొంగతనానికి పాల్పడేవారని స్థానికులు వెల్లడించారు.

Next Story

Most Viewed