శీతాకాలంలో ఆ సమస్యలతో బాధ పడుతున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

169

దిశ, వెబ్‌డెస్క్ : రోజు రోజుకు చలి తీవ్రత విపరీతంగా పెరుగుతోంది. ఉదయం 10 అవుతున్న చలి తీవ్రత తగ్గకపోవడంతో వృద్ధులు, పసి పిల్లలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఇలా విపరీతమైన చలి ఉన్న సమయంలో కొన్ని రకాల వ్యాధులు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఆస్తమా, సీఓపీడీ లాంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఈ శీతాకాలంలో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని వైద్యులు చెబుతున్నారు. చలి తీవ్రత అధికంగా ఉండటంతో వారి పరిస్థితి ఆందోళనకరంగా మారే అవకాశం ఉందని, శ్వాసనాళాలు సంకోచించడమే ప్రధాన కారణమని తెలుపుతున్నారు. ఎక్కువగా చలి ఉన్న సమయంలో బయట తిరగకుండా ఉండటం మంచిదని హెచ్చరిస్తున్నారు. అంతే కాకుండా వీలైనంత వరకు చలి తీవ్రత తగ్గే వరకు ఉన్ని దుస్తులు, స్వెటర్ వంటివి ధరించాలని సూచిస్తున్నారు. అంతే కాకుండా చలి ఎక్కువగా ఉందని టీ, కాఫీలు తరచూ తీసుకోవడం మంచిది కాదని పేర్కొన్నారు. సీఓపీడీ, ఆస్తమా మొదలైన సమస్యలతో బాధపడుతున్న వారు తప్పనిసరిగా వైద్యుల సలహా మేరకు వ్యాధి నియంత్రణలో ఉంచుకునే మందులు వాడాలని కోరుతున్నారు.