మ్యూజిక్ విత్ ఐస్

by  |
మ్యూజిక్ విత్ ఐస్
X

దిశ, ఫీచర్స్ : ‘పాటల పల్లకిలోన, చిగురాకుల సవ్వడిలోన నిరంతరం వసంతమే సంగీతం’ అని మ్యూజిక్ గొప్పదనాన్ని గూర్చి ఓ సినీకవి అత్యద్భుతంగా వర్ణించారు. మనిషికి సాంత్వన కలిగించే దివ్యఔషధం మ్యూజిక్ కాగా, దాన్ని ఆస్వాదించని వారు లోకంలో ఎవరూ ఉండరేమో! అయితే కాలగమనంలో మాటతో పాటు పాటను నేర్చుకున్న మనిషి.. ఆ పాటకు తీయదనాన్ని యాడ్ చేసే మ్యూజిక్ గురించి కూడా తెలుసుకున్నాడు. ఈ మేరకు సంగీత సాహిత్యాలు రకరకాలుగా రూపాంతరం చెందుతుండగా.. అందులోనూ రకరకాల ప్రక్రియలు పురుడు పోసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఐస్ మ్యూజిక్ (మంచు సంగీతం) బాగా పాపులర్ అవుతోంది. అసలు ఈ సంగీతం ఎక్కడ పుట్టింది? మంచు ప్రదేశంలో ఎలా కంపోజ్ చేస్తున్నారు? వారు వాడుతున్న ఇన్‌స్ట్రుమెంట్స్‌ తయారీకి ఎంత సమయం పడుతుంది? అనే వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

సప్త స్వరాలతో సృష్టించే సంగీతం మనిషి జీవితంలో ఓ అంతర్భాగం. ఈ సంగీతంలో ఒక్కొక్కరిది ఒక్కో ప్రపంచం. ఎవరికి తోచిన విధంగా వారు సంగీతాన్ని తమదైన శైలిలో మలచుకుంటున్నారు. శాస్త్రీయ సంగీతంతో పాటు జానపదం, ఇతరత్రా శైలులు సంగీత సామ్రాజ్యంలో అలరారుతుండగా.. పాప్, పాప్‌, రాక్‌బ్యాండ్‌, బ్రాస్‌బ్యాండ్‌, ఫ్యూజిన్‌, ఇండిపాప్‌ వంటివి యువతను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ మధ్య కాలంలో సినిమాల్లో కూడా యూత్ టార్గెటెడ్ ఫాస్ట్ బీట్స్ ఎక్కువగా వినిపిస్తుండగా, మ్యూజిక్ మానసిక ఆరోగ్యాన్ని అందిస్తుందని పలు పరిశోధనలు నిర్ధారించాయి. ఆటిజం చిన్నారులకు, కేన్సర్‌ చికిత్స పొందుతున్న వారికి మ్యూజిక్‌ థెరపీ మంచి ఉపశమనం కలిగిస్తుందని మెడికల్ అధ్యయనాలు కూడా పేర్కొన్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా మ్యూజీషియన్స్ డిఫరెంట్ అండ్ యూనిక్ స్టైల్‌లో మ్యూజిక్ కంపోజ్ చేసేందుకు కసరత్తు చేస్తూనే ఉంటారు. ఈ క్రమంలో 2012లో తొలిసారి ఈ ఐస్ మ్యూజిక్(మంచు సంగీతం) తెరపైకి వచ్చింది.

రష్యాలో మంచుతో గడ్డకట్టిన ‘బైకల్’ సరస్సు వద్ద మ్యూజిక్ అంటే అపారమైన ఇంట్రెస్ట్‌ గల కొందరు వాయిద్యకారులు ఓ ప్రయోగం చేశారు. మంచు గడ్డలతోనే శ్రుతి లయలతో కూడిన శబ్దాలు సృష్టించేందుకు ప్రయత్నించారు. మంచు గడ్డలను కూలుస్తూ లోహపు డ్రమ్స్‌ను సపోర్ట్‌గా తీసుకుని యూనిక్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఇదంతా వీడియో తీసి షేర్ చేయగా అప్పట్లో అది నెట్టింట వైరల్ అయింది. అలా సైబీరియన్ వాయిద్యకారులు ప్రపంచానికి ఐస్ సంగీతాన్ని పరిచయం చేశారు. అయితే 2000 సంవత్సరంలోనే నార్వే మ్యూజిక్ కంపోజర్ తెర్జే ఇసంగ్‌సెట్.. తొలి ఐస్ మ్యూజిక్ కాన్సర్ట్‌ను నార్వేలోని లిలెహమర్ జలపాతం వద్ద నిర్వహించాడు. ఆ తర్వాత 2006లో ‘ఐస్ మ్యూజిక్ ఫెస్టివల్ నార్వే’ పేరిట మైనస్ డిగ్రీ టెంపరేచర్‌లో ఐస్ మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్స్‌తో మ్యూజిక్ కంపోజ్ చేసి సెలబ్రేషన్స్ నిర్వహించిన తెర్జే.. ఏటా ఈ ఫెస్టివల్‌ను నిర్వహించాలని నిర్ణయించాడు. ఈ క్రమంలో గతేడాది ఫిబ్రవరిలో ఐస్ మ్యూజిక్ ఫెస్ట్ నార్వేలోని ఫిన్సె విలేజ్‌లో జరగ్గా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా అక్కడే జరగాల్సింది కానీ కొవిడ్ వల్ల నిర్వహించలేకపోతున్నట్లు తెర్జే పేర్కొన్నాడు. కాగా ఈ నెల 14న లైవ్ స్ట్రీమ్ కాన్సర్ట్ ప్లాన్ చేయబోతున్నట్లు ఆయన తెలిపాడు.

స్టోన్స్, వుడ్‌తో మ్యూజిక్ కంపోజ్ చేసిన తెర్జే.. నెక్స్ట్ టార్గెట్‌లో భాగంగా ఐస్ మ్యూజిక్ కంపోజిషన్‌కు పూనుకున్నాడు. అలా తొలిసారి చల్లటి మంచు గడ్డలతో సంగీతం సృష్టించాడు. అయితే అంత చల్లటి మంచు ముక్కలతో ప్రయోగం చేసేందుకు మొదట్లో చాలా కష్టపడ్డాడు. కానీ ఆ తర్వాత యూనిక్ స్టైల్ మ్యూజిక్ రావడంతో ఆనందంగా ముందుకు సాగాడు. ‘ఐస్ మ్యూజిక్ అనేది మానవ ప్రాజెక్టు కాదని, అది ప్రకృతి దర్శకత్వంలో కొనసాగే మ్యూజికల్ ప్రాజెక్టు’ అని తెర్జే ఇసంగ్‌సెట్ చెప్పుకొచ్చారు.

వందల మ్యూజిక్ కాన్సర్ట్స్‌లో ఐస్ మ్యూజిక్స్ నిర్వహించిన ‘తెర్జే’ పేరు మీద పలు రికార్డులు నమోదయ్యాయి. మంచు వాయిద్యకారుడిగా తనకు ఇన్‌స్ట్రుమెంట్స్(పరికరాల) తయారీకే ఆయనకు చాలా కాలం పడుతుండగా.. ఇందుకోసం అమెరికాకు చెందిన మంచుశిల్పి బిల్ కొవిట్జ్, టిమ్ లిన్‌హర్ట్ సహకారం తీసుకున్నాడు. వీటితో ఇగ్లూ కేఫ్స్‌లో లిమిటెడ్ మెంబర్స్‌తో మ్యూజిక్ ఫెస్ట్ నిర్వహించగా, అవి శ్రోతలను ఆకట్టుకున్నాయి. లిన్‌హర్ట్ రూపొందించిన ఐస్ వయొలిన్‌తో కంపోజ్ అయిన మ్యూజిక్‌కు ఫిదా అయిన మ్యూజిక్ లవర్స్.. నెక్ట్స్ ఐస్ మ్యూజిక్ ఫెస్ట్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు? అని వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ మ్యూజిక్ కంపోజిషన్ ఎక్కువ సమయం పాటు కొనసాగే అవకాశం ఉండదు. గంట లేదా రెండు గంటలకు వరకు మాత్రమే పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. కాగా ఐస్‌తో మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్ తయారు చేసే ప్రాసెస్‌ను ‘ఐస్‌మ్యాన్‌షిప్’ అని పేర్కొంటారు.Next Story

Most Viewed