సరిహద్దులో జోరుగా కోడిపందాలు.. లక్షల్లో బెట్టింగులు..

86

దిశ అశ్వారావుపేట/దమ్మపేట: తెలంగాణ-ఆంధ్ర రాష్ట్రాల సరిహద్దు పశ్చిమ గోదావరి జిల్లాలోని సీతానగరం, కామయ్యపాలెం గ్రామలలో సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు, పేకాట జోరుగా సాగుతున్నాయి. నిర్వాహకులు కోడిపుంజులకు కత్తులు కట్టి పందాలు నిర్వహిస్తున్నారు. ఒక్కో జోడి పందెంకు లక్షల రూపాయలు బెట్టింగులు కాస్తున్నారు. కోడి పందాలు కాకుండా పేకాట, భాగ్యలక్ష్మి బంపర్ డ్రా లాంటి జూదాలు జోరుగా సాగుతున్నాయి.

కోడిపందాలు, పేకాట ద్వారా ఒక్కరోజులో లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా సీతానగరం గ్రామంలో ఈ పండగ మూడు రోజులు పాటు 24 గంటలు పేకాట ఆడేందుకు పెద్ద విద్యుత్ లైట్లు, టెంట్లు ఏర్పాటు చేశారు. కోడి పందాలు నిర్వహించడం ద్వారా ఒక్క రోజులో వందల కోడి పుంజులు మరణిస్తునాయి. పోలీసులు కూడా చూసీచూడనట్లుగా వ్యవహరించడం కూడా జూదం అడేవారికి కలిసి వచ్చినట్లుగా కనిపిస్తోంది.