ఆక్సిజన్ తెచ్చే నౌకలపై అన్ని చార్జీలు మాఫీ

by  |
ఆక్సిజన్ తెచ్చే నౌకలపై అన్ని చార్జీలు మాఫీ
X

న్యూఢిల్లీ: దేశంలో ఆక్సిజన్ కొరతను అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటున్నది. ఇతర దేశాల నుంచి ఆక్సిజన్ ట్యాంక్‌లు, బాటిళ్లు, మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, పోర్టేబుల్ ఆక్సిజన్ జెనరేటర్లు, ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు, ఆక్సిజన్ సిలిండర్లకు ఉపయోగించే స్టీల్ పైప్‌లను మోసుకొచ్చే నౌకలపై అన్ని రకాల చార్జీలను మాఫీ చేయాలని ప్రధాన పోర్టులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నౌకలను వెంటనే బెర్తింగ్ చేయడానికి ప్రాధాన్యతనివ్వాలని, అంతేవేగంగా అన్‌లోడ్ చేయడానికి చర్యలు తీసుకోవాలని కేంద్ర పోర్టులు, షిప్పింగ్, వాటర్‌వేస్ మంత్రిత్వ శాఖ కామరాజ్ పోర్టు లిమిటెడ్ సహా అన్ని మేజర్ పోర్టులను ఆదేశించింది. ఈ చర్యలను ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని పోర్టు చైర్‌పర్సన్‌లను కోరింది. అన్‌లోడింగ్‌కు కావాల్సిన కస్టమ్స్, ఇతర అధికారుల నుంచి వేగంగా క్లియరెన్స్‌లు వచ్చేందుకు ఉపక్రమించాలని తెలిపింది.

Next Story