దశదిన కర్మలో విషాదం.. బాబాయ్ చనిపోయిన పదిరోజులకే..

by  |
young man dead
X

దిశ, అన్నపురెడ్డిపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని రాజపురం గ్రామానికి చెందిన రామకృష్ణ అనే వ్యక్తి ఇటీవల అనారోగ్యంతో మరణించారు. గురువారం దశదినకర్మ కావడంతో కుటుంబసభ్యులదరూ దశదినకర్మ నిర్వహించేందుకు గ్రామంలోని చెరువు వద్దకు వెళ్లారు. కార్యక్రమం అనంతరం స్నానాలు చేయడానికి చెరువులోకి దిగారు. ఈ క్రమంలో రామకృష్ణ అన్నకొడుకు తిరుమలదాస్ శ్రీనివాస్(24) ప్రమాదవశాత్తు నీటమునిగాడు. గమనించిన కుటుంబసభ్యులు మూడు గంటలపాటు వెతికి, వెలికి తీసినా ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే శ్రీనివాస్ మృతిచెందాడు. దీంతో అప్పటికే విషాదంలో ఉన్న కుటుంబంలో మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు.

Next Story

Most Viewed