అందాలను ఆస్వాదిస్తూ గల్లంతైన డిగ్రీ స్టూడెంట్

by  |
gallanthu1
X

దిశ, మర్రిగూడ: జలపాతంలో యువకుడు గల్లంతైన సంఘటన మర్రిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై నాగుల్ మీరా తెలిపిన వివరాల ప్రకారం… సూర్యాపేటకు చెందిన తాళ్ల తేజ(20) అనే యువకుడు 8 మంది స్నేహితులతో కలిసి ఆదివారం మర్రిగూడ మండలంలోని అజిలాపురం బుగ్గ జలపాతం అందాలను వీక్షించేందుకు వచ్చాడు. అయితే, వారు జలపాతంలో స్నానం చేస్తుండగా తేజ నీటిలో కొట్టుకుపోయాడు. స్నేహితులు ఎంత వెతికినా తేజ ఆచూకీ లభించకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వడంతో వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అనంతరం గ్రామస్తుల సహకారంతో తేజ ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. అయినా అతడి ఆచూకీ తెలియరాలేదు. గల్లంతైన తేజ ప్రస్తుతం హైదరాబాద్ లో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.

Next Story

Most Viewed