కుబీర్‌లో విషాదం.. కాలువలోకి దూసుకెళ్లిన బైకు

by Aamani |
Road accident
X

దిశ, కుబీర్: నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్ తాలుకాలోని పాటుదత్తడి గ్రామానికి చెందిన రొంటే శంకర్(33), నిర్మల్ జిల్లా కుబీర్ మండలం వాయి గ్రామంలోని తమ అత్తగారింటికి వచ్చాడు. అనంతరం తిరిగి సొంత గ్రామానికి వెళ్తుండగా వాయి గ్రామ సమీపంలోని మూలమలుపు వద్ద ప్రమాదవశాత్తు బైకుతో సహా కాలువలో పడ్డాడు. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఎస్ఐ గంగారం దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed