వంద మంది భార్యలు, వెయ్యి మంది పిల్లలే లక్ష్యం.. 17వ పెళ్లికి సిద్ధమైన వరుడు

by  |
వంద మంది భార్యలు, వెయ్యి మంది పిల్లలే లక్ష్యం.. 17వ పెళ్లికి సిద్ధమైన వరుడు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రతి ఒక్కరికి జీవితంలో ఒక కోరిక ఉంటుంది. కొంతమందికి ఆ కోరిక తీరుతుంది.. మరికొంతమందికి అది చివరి కోరికగా మిగిలిపోతుంది. అయితే ఆ కోరికలు కొన్ని వింతగా ఉంటాయి. ఇక్కడ మనం చెప్పుకొనే వ్యక్తి కోరిక ఇంకా వింతగా ఉంటుంది. సాధారణంగా పెళ్లి చేసుకొని ఒక భార్యతోనే వేగలేకపోతున్నాం అంటూ భర్తలు గగ్గోలు పెడుతుంటారు. కానీ ఈ వ్యక్తి మాత్రం చనిపోయేవరకు పెళ్లుళ్లు చేసుకోవడం… పిల్లల్ని కనడమే తన లక్ష్యం అంటున్నారు. అదే తన కోరిక అంటూ చెప్పుకొచ్చాడు. కొంచెం వింతగా.. విడ్డురంగా ఉంది కదా.. అయితే అతను ఎవరు? ఎక్కడుంటాడు? అనేది తెలుసుకుందాం.

జింబాబ్వేకు చెందిన మిషెక్ న్యాన్డెరో అనే విశ్రాంత ఉద్యోగికి చిన్నప్పటినుండి ఒక వింత కోరిక ఉండేదట. తానూ చనిపోయేవరకు పెళ్లుళ్లు చేసుకోవడం… పిల్లల్ని కనడం ఆపకూడదని నిర్ణయించుకున్నాడట. ఇక ఈ కోరికను అమలు చేస్తూ 1983 నుండి ఇప్పటివరకు 16 మందిని పెళ్లిచేసుకొని 151 మంది పిల్లలకు తండ్రయ్యాడు. దేవుడా.. 16 మంది భార్యలా అని ఆశ్చర్యపోకండి.. త్వరలోనే ఈయన 17 వ పెళ్ళికి సిద్దమవుతున్నాడట.. ఇక వంద మందిని వివాహమాడి… వెయ్యి మంది పిల్లలు కనాలన్నదే తన చిరకాల కోరిక అని సిగ్గుపడుతూ చెప్తున్నాడు మిషెక్ న్యాన్డెరో. అంతా బాగానే ఉంది.. ఇతగాడిని పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు ఎలా ఒప్పుకొంటున్నారు.. అనేగా మీ అనుమానం.. మిషెక్ న్యాన్డెరో పెళ్ళికి ముందే కాబోయే భార్యకు ఈ విషయం స్పష్టంగా చెప్పిన తర్వాతే మిగతా కార్యక్రమాలకు ఏర్పాట్లు చేస్తారట. అయితే ఇప్పటివరకు ఉన్న భార్యలందరు తన భర్త అందర్నీ సమానంగా చూసుకొంటాడని, అందరికి తగిన గౌరవం ఇస్తుండడంతో తమ భర్త అంటే ఇంకా ప్రేమ పెరుగుతుందని తెలిపారు.

ఇక ఇంతమంది సంతానం, భార్యలు అంటే ఆర్థిక సమస్యలు రావా..? అంటే దానికి సమాధానం చెప్పాడు. తన పిల్లల్లో చాలామంది ఇప్పటికే పెరిగి పెద్దవారై ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు చేస్తున్నారని, వారు తమ ఖర్చులకు కావాల్సిన డబ్బులు పంపిస్తారని తెలిపాడు. తన సమయాన్నంతా భార్యలను చూసుకోవాడినికి మాత్రమే వెచ్చిస్తానాన్ని తెలిపాడు. ఏది ఏమైనా పుర్రెకో బుద్ధి… జిహ్వకో రుచి అంటే ఇదేనేమో..


Next Story