సిద్దిపేట ఎర్రచెరువు కట్టపై అతిపెద్ద బతుకమ్మ

37

దిశ సిద్దిపేట: తెలంగాణలో సద్దుల బతుకమ్మ ఉత్సవాలు అంబరాన్ని అంటాయి. మహిళలు ఎంతో ఉత్సాహంతో బతుకమ్మకు పూజలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సిద్దిపేటలోని స్థానిక ఎర్ర చెరువు కట్టపై అతిపెద్ద బతుకమ్మను బంతిపూలతో ఏర్పాటు చేశారు. సద్దుల బతుకమ్మకు వస్తున్న జనాలు ఈ బతుకమ్మను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అతిపెద్ద బతుకమ్మ ఏర్పాటు కోసం గాడిచెర్ల సతీష్, బోనాల నాగరాజు, నాయిని కృష్ణ, బోనాల శ్రీనివాస్, కట్టదుర్గమ్మ దేవాలయ, యూత్ సభ్యులు కృషి చేశారు. ఈ సందర్భంగా భక్తులకు పులిహోర ప్రసాదాన్ని పంచిపెట్టారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..