ఉద్యోగ సంఘం నాయకులపై సస్పెన్షన్ వేటు

by Disha Web |
ఉద్యోగ సంఘం నాయకులపై సస్పెన్షన్ వేటు
X

దిశ ఏపీ బ్యూరో: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. జీఎస్టీ విభాగంలో పని చేస్తున్న నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రసాద్, మెహర్ కుమార్, సంధ్య, గడ్డం ప్రసాద్ లను సస్పెండ్ చేశారు. రాష్ట్రంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంలో ఈ నలుగురు అధికారులు కీలకంగా పనిచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఇటీవల గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఫిర్యాదు చేసింది. గవర్నర్ ను కలిసిన ప్రతినిధి బృందంలో ఈ నలుగురు కూడా ఉన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు ఏసీటీవోలపై చర్యలు తీసుకోవడం ప్రస్తుతం చర్చకు దారితీసింది. తమ సంఘంలో కీలకంగా ఉన్నందునే ఈ నలుగురిని సస్పెండ్ చేశారని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు ఆరోపణలు చేస్తున్నారు.


Next Story