తల్లి ఎదుటే తండ్రిని నరికి చంపిన కొడుకు..

by  |
crime
X

దిశ, సంగారెడ్డి: కుటుంబ కలహాలతో తండ్రిని హతమార్చిన సంఘటన సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం పెద్దాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. సదాశివపేట సీఐ సంతోష్ కుమార్, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. సదాశివపేట మండలం లోని పెద్దాపూర్ గ్రామంలో నివాసముంటున్న మహమ్మద్ ఆన్వర్ (48) తన భార్య హైముదా బేగంతో ప్రతినిత్యం మద్యం సేవించి గొడవలకు దిగే వాడు. అదే క్రమంలో గురువారం రాత్రి అన్వర్ మద్యం సేవించి భార్యతో గొడవకు దిగాడు. ఈ గొడవలో అన్వర్ తన భార్య పైకి గొడ్డలితో కొట్టడానికి వెళ్ళాడు. వీరిద్దరి మధ్యకు కొడుకు వచ్చి ఆవేశంతో తండ్రి చేతిలోని గొడ్డలిని లాక్కుని తండ్రిని హతమార్చాడు. దాంతో తండ్రి అన్వర్ అక్కడికక్కడే మృతి చెందాడని సిఐ తెలిపారు. మృతుడి తమ్ముడు అన్సారీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సిఐ సంతోష్ కుమార్ తెలిపారు.

Next Story

Most Viewed