దారుణం.. తండ్రి అలా చేశాడని కడతేర్చిన కొడుకు..

48
mother killed daughter

వెల్గటూర్: జగిత్యాల జిల్లా, వెల్గటూర్ మండలంలోని సూరారం గ్రామానికి చెందిన దుర్గం చంద్రయ్య(45)ను అతని కుమారుడు దుర్గం పవన్ కర్రతో తల పై కొట్టి హత్య చేశాడు. ఎస్సై నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని సూరారం గ్రామానికి చెందిన దుర్గం చంద్రయ్య ప్రతి రోజు మద్యం సేవించి ఇంటికి వచ్చి అతని భార్య లక్ష్మితో గొడవ పడుతూ ఉండేవాడు.

గురువారం కూడ అదేవిధంగా మద్యం సేవించి భార్యతో గొడవ పడుతుండటంతో భరించలేక అతని పెద్ద కొడుకు కర్రతో చంద్రయ్య తల పై కొట్టాడు. దీంతో చంద్రయ్య తలకు పెద్ద గాయం అయింది. తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మరణించాడు. దీన్ని గమనించి పవన్ ఇంట్లో నుండి పారిపోయాడు. మృతుని భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ నరేష్ వివరించారు.