- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
టపాసులు పేల్చిందని విద్యార్థినిపై ప్రిన్సిపాల్ దారుణం

దిశ, వెబ్ డెస్క్ : ఓ పాఠశాలలో దీపావళి టపాసులు పేల్చిందని తమ కూతురిని ప్రిన్సిపాల్ కొట్టారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. చిన్న తప్పుకే కొట్టడంతో పాటు గదిలో బంధించి భయభ్రాంతులకు గురి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. సంతకవిటి మండలానికి చెందిన విద్యార్థిని పొందూరు మండలం వావిలపల్లిపేట సమీపంలోని మోడల్ స్కూల్‌లో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. అక్కడే హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటుంది.
అయితే పాఠశాలలో దీపావళి టపాసులు కాల్చిందని ప్రిన్సిపాల్ విద్యార్ధిని కొట్టాడు.అంతటితో ఆగకుండా గదిలో బంధించారని పిల్లల ద్వారా తల్లిదండ్రులకు తెలిసింది. తక్షణం బంధువులతో కలిసి స్కూల్ వద్దకు చేరుకుని ఆరా తీశారు. అనంతరం కుమార్తెను తీసుకుని పొందూరులో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చూపించారు. చెంపపై గట్టిగా కొట్టడంతో తన కుమార్తె చెవిపోటుతో బాధపడుతుందని విద్యార్థిని తండ్రి ఆరోపించాడు. ఆ తరువాత పొందూరు పోలీస్ట్ స్టేషన్‌లో స్కూల్ ప్రిన్సిపాల్‌పై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న ఎస్సై లక్ష్మణరావు పాఠశాలకు వెళ్లి ఆరా తీశారు.