గుస్సాడి కనక రాజుకు పద్మశ్రీ అవార్డు ప్రదానం

by Aamani |
Rastrapathi-12
X

దిశ, జైనూర్: ఆదివాసి సంస్కృతి, సంప్రదాయాలకు దేశానికే కాకుండా ప్రపంచానికే తెలియజేసిన గుస్సాడి కనక రాజుకు అరుదైన గౌరవం లభించింది. గుస్సాడి నృత్యాలు ప్రదర్శించిన కనక రాజు మంగళవారం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతులు మీదుగా దేశ అత్యుత్తమ పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. దీంతో ఆదివాసీల్లో సర్వాత్ర హర్షం వ్యక్తం అవుతోంది. గతంలో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఆదివాసీ సంస్కృతి అయిన గుస్సాడి నృత్యాలను ప్రదర్శించిన కనకరాజు పద్మశ్రీ అవార్డు కోసం ఎంపిక కాగా రెండు రోజుల క్రితమే కనక రాజు ఢిల్లీ చేరుకున్నారు. మంగళవారం సాయంత్రం కనక రాజుకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పద్మశ్రీ అవార్డును ప్రదానం చేశారు.

Advertisement

Next Story

Most Viewed