దేశంలో.. తెలంగాణ పోలీస్ శాఖ నెం.1 : హోం మంత్రి

by  |
దేశంలో.. తెలంగాణ పోలీస్ శాఖ నెం.1 : హోం మంత్రి
X

దిశ, క్రైమ్ బ్యూరో: అధునాతన హంగులతో నిర్మించబడిన నాంపల్లి లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల నూతన భవనాలను రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, సినీమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి గురువారం ప్రారంభించారు. అనంతరం హోంమంత్రి మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ దేశంలోనే నెంబరు వన్ స్థానంలో ఉందన్నారు. గతంలో పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలంటేనే ప్రజలు భయపడేవారని, ప్రస్తుతం అలాంటి పరిస్థితులను తొలగించి ప్రజలతో మమేకం అయ్యేలా సీఎం కేసీఆర్ పీపుల్స్ ఫ్రెండ్లీ వ్యవస్థను ప్రవేశపెట్టినట్టు తెలిపారు. హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ పరిధిలో సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేసి నేరాలను తగ్గించినట్టు తెలిపారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న పోలీస్ శాఖ సంస్కరణలను అధ్యయనం చేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి అధికారులు వస్తున్నట్టు వివరించారు. డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. శాంతి భద్రతలు సక్రమంగా ఉంటేనే రాష్ట్ర సంపద పెరిగి ప్రజల స్థితిగతులు మెరుగుపడతాయని అన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం పోలీస్ శాఖకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు.



Next Story

Most Viewed