- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఛలాన్ల విధింపుల్లో పోలీసులు అత్యుత్సాహం
దిశ, బెల్లంపల్లి: పోలీసు శాఖలోని సిబ్బంది వాహనదారులకు అన్ని పత్రాలు ఉన్నప్పటికీ ఏదో ఒక సాకుతో ఛలాన్లను విధించాలనే అత్యుత్సాహం ప్రదర్శిస్తూ పలువురిని ఇక్కట్లకు గురి చేస్తున్న సందర్భాలు కోకొల్లలు. ఇందుకు తార్కాణంగా బెల్లంపల్లి పట్టణంలోని టూ టౌన్ పరిధిలో మంగళవారం ద్విచక్ర వాహనదారుడు రవి తన ద్విచక్ర వాహనం నెంబర్ AP01Q 6039 వాహనంపై రైల్వే స్టేషన్ లోని బంకు వద్దకు వెళ్లి పెట్రోలు నిమిత్తం వెళ్లి తిరిగి వస్తుండగా.. పోలీసు శాఖకు చెందిన ఇద్దరు సిబ్బంది వాహనాన్ని ఫ్లైఓవర్ ముందుభాగంలో ఆపి పత్రాలను పరిశీలించారు.
అందులో పొల్యూషన్ సర్టిఫికేట్ నాలుగు నెలల క్రితమే కాలపరిమితి ముగియడంతో వాహనదారుడు పోలీసు సిబ్బందిని తాను కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నానని ప్రాధేయపడినప్పటికి దురుసుగా ప్రవర్తించి వాహనానికి సంబంధించిన ఆర్ సి,డ్రైవింగ్ లైసెన్స్ ,ఇన్సూరెన్సు ధ్రువీకరణ పత్రాలను బలవంతంగా తీసుకుని పోలీసు సిబ్బంది వద్ద ఉన్న ట్యాబ్ లో ధ్రువీకరణ పత్రాలు లేవని నమోదు చేసి రూ.2,100 జరిమానా విధించిన సందేశాన్ని మొబైల్ కు పంపడంతో అవాక్కయ్యాడు. నిబంధనల మేరకు పొల్యూషన్ సర్టిఫికెట్ లేనిపక్షంలో జరిమానాగా రూ.వెయ్యి విధించాల్సిన సిబ్బంది ధ్రువీకరణ పత్రాలు అన్ని ఉన్నప్పటికీ.. వాహనదారులను ఇక్కట్లకు గురిచేస్తున్న కోకొల్లలు.