ఆర్జీవీకి కరోనా.. అన్ని అబద్ధాలన్న అమృత

by  |
ఆర్జీవీకి కరోనా.. అన్ని అబద్ధాలన్న అమృత
X

దిశ, వెబ్‌డెస్క్: మర్డర్ సినిమా విడుదలను రద్దు చేయాలని నల్గొండ ఎస్సీ, ఎస్టీ స్పెషల్‌ కోర్టులో అమృత పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ రోజు వర్మ కౌంటర్ దాఖలు చేయాలని నల్గొండ కోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసింది. ఇదే వ్యవహారంపై అమృత, వర్మ తరఫు న్యాయవాది మంగళవారం విచారణకు హాజరయ్యారు.

అయితే, రామ్ గోపాల్ వర్మకు కరోనా సోకడంతో అఫిడవిట్ మీద సంతకం చేయలేకపోయారని వర్మ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అంతేకాకుండా, విచారణ మరో రోజుకు వాయిదా వేయాలని అభ్యర్థించారు. వీటిని పరిగణలోకి తీసుకున్న కోర్టు విచారణను ఆగస్టు 14కి వాయిదా వేస్తూ తీర్పునిచ్చింది.

ఇది ఇలా ఉండగా కావాలనే కోర్టుకు వర్మ తప్పుడు సమాచారం ఇచ్చారని అమృత ఆరోపిస్తున్నారు. ఆర్జీవీకి కరోనా సోకలేదని ఇటీవల ఆయన ట్విట్టర్‌లో ప్రకటించారంటూ గుర్తు చేశారు. వచ్చే వాయిదాలో ఆర్జీవీకి కరోనా సోకిందో లేదో అన్న అంశంపై నిజాలు తెలుపుతామని అమృత తరఫుణ న్యాయవాది నల్గొండ ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టుకు తెలియజేశారు. దీంతో కేసు విచారణ ఈ నెల14వ తేదీన జరగనుంది.



Next Story

Most Viewed