ప్రేక్షకులు లేకుండానే ఒలింపిక్ గేమ్స్

by  |
Olympics
X

దిశ, వెబ్‌డెస్క్: జపాన్ దేశంలో క్రమక్రమంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ ప్రభావం ఒలింపిక్స్ మీద పడే అవకాశం ఉందని నిర్వాహకులు భావిస్తున్నారు. నిజానికి జూలై 23 నుంచి ఆ గస్టు 8 వరకు జపాన్ రాజధాని టొక్యోలో ప్రపంచ క్రీడల పోటీలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో కొవిడ్ కేసులు పెరడగం ఆ దేశ ప్రభుత్వంతో పాటు, క్రీడాకారులనూ కలవరపెడుతోంది. దీంతో స్టేడియాలలో ప్రేక్షకులను అనుమతించకుండానే పోటీలు నిర్వహించాలని నిర్వాహకులు యోచిస్తున్నారని సమాచారం. ఈ క్రీడలు కిందటి సంవత్సరమే జరగాల్సి ఉండగా కోవిడ్ కారణంగానే వాయిదా పడ్డాయి.

ఒలింపిక్ క్రీడల 33 పోటీలు, 339 ఈవెంట్స్ 42 వేదికలలో జరుగుతాయి. వీటిలో చాలావరకు గ్రేటర్ టోక్యోలోనే జరగనున్నాయి. ఇక్కడ కూడా కోవిడ్ అత్యవసర పరిస్థితి నెలకొని ఉంది. భారత్‌ నుంచి దాదాపు వంద మందికి పైగా అథ్లెట్లు టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు అర్హత సాధించారు. టోక్యో వెళ్లబోయే అథ్లెట్లతోపాటు అధికారులకు కూడా రెండు డోసుల వ్యాక్సిన్లు ఇస్తామని భారత క్రీడా మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. క్రీడాకారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

Next Story

Most Viewed