ఏపీలో పెరుగుతున్న వింత వ్యాధి బాధితుల సంఖ్య

102

దిశ,వెబ్‌డెస్క్: పశ్చిమ గోదావరి జిల్లాలో వింతవ్యాధి బాధితుల సంఖ్య పెరుగుతోంది. భీమడోలు మండలం పూళ్లలో వింత వ్యాధి బాధితుల సంఖ్య 31కు చేరింది. చుట్టు పక్కల గ్రామాలకు వింత వ్యాధి విస్తరిస్తోంది. గుండు గొలను, అరుంధతీ కాలనీ,వడ్లకట్ల, అర్జావారి గూడెంలోనూ వింత వ్యాధి సోకింది. కాగా భీమడోలులో వైద్యులు ఇద్దరికి చికిత్స అందించారు. మరో ముగ్గురిని ఏలూరుకు తరలించారు. ఆహార పదార్థాల శాంపిల్స్‌ను ఫుడ్ సేఫ్టీ అధికారులు సేకరించారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..