ఆ పని చేయను అన్నందుకు.. కొడుకునే చంపేసిన తల్లి..

by  |
ఆ పని చేయను అన్నందుకు.. కొడుకునే చంపేసిన తల్లి..
X

దిశ, వెబ్ డెస్క్: తనకు నచ్చని పని చేస్తున్నాడన్న కోపంతో కన్న తల్లే కొడుకును అతి కిరాతకంగా చంపింది. తమిళనాడులోని సేలంలో ఈ ఘటన జరిగింది. నవీన్ అనే 19 ఏళ్ల యువకునికి మొదటి నుంచి అమ్మాయి లక్షణాలు ఉన్నాయి. తాను ట్రాన్స్ జెండర్ గా మారుతానని చాలా కాలంగా తల్లికి చెబుతూ వస్తున్నాడు. కానీ తన కొడుకు అలా మారడం ఇష్టం లేని తల్లి వారిస్తూ వచ్చింది. తల్లి మాట వినకుండా నవీన్ అక్షిత గా తన పేరు మార్చుకున్నాడు.

దాంతో కోపంతో ఊగిపోయిన తల్లి మరో ఐదుగురిని కిరాయికి మాట్లాడి కొడుకు మీదకు దాడికి దిగింది. బలమైన దెబ్బలు తగలడంతో నవీన్ సొమ్మసిల్లి పడిపోయాడు. చుట్టుపక్కన వాళ్లు నవీన్ చూసి హుటాహుటి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడి ప్రాణాలు పోయాయని డాక్టర్లు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. తల్లే ఈ హత్య చేసిందని తెలిసి ఆమెను అరెస్ట్ చేశారు.

మగవాడిగా తన కొడుకు ఉండాలని దానికోసం హార్మోన్లను తీసుకోవాలని చెప్పినా నవీన్ వినలేదని అందుకే కొడుకును హతమార్చినట్టు పోలీసులతో ఒప్పుకుంది. ఈ కేసులో తల్లి ఉమాదేవితో పాటు, కామరాజ్, వెంకటేష్, సంతోష్, కార్తకేయ, శివకుమార్ లను సేలం పోలీసులు అరెస్ట్ చేశారు.

Next Story

Most Viewed