వేములవాడలో దారుణం.. పిల్లల గొంతు కోసి తాను కోసుకున్న తల్లి!

by  |
వేములవాడలో దారుణం.. పిల్లల గొంతు కోసి తాను కోసుకున్న తల్లి!
X

దిశ, వేములవాడ టౌన్ : సిరిసిల్ల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ తల్లి పిల్లల గొంతు కోసి ఆ తర్వాత తాను గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన జిల్లాలోని వేములవాడ పట్టణంలో శనివారం వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం దమ్మన్నపేట గ్రామానికి చెందిన మమత 15 రోజుల కిందట తల్లిగారి ఇల్లు కామారెడ్డికి వెళ్ళింది. తిరుగు ప్రయాణంలో మమత వేములవాడకు చేరుకుంది. ఆమెతో కుమారులు వరుణ్ తేజ, అక్షయలు ఉన్నారు. అయితే, ఏం జరిగిందో తెలియదు.

ఒక్కసారిగా పిల్లల గొంతు కోసి తాను కూడా గొంతు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది మమత.. ఆ తర్వాత తన భర్తకు ఫోన్ చేసి సమాచారం అందించింది. అతను వెంటనే వేములవాడకు చేరుకుని పిల్లలను వేములవాడ ప్రభుత్వ దవాఖానకు తరలించాడు. ప్రాథమిక చికిత్స అనంతరం సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అయితే, కుటుంబ కలహాల నేపథ్యంలోనే మమత ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story