దాతృత్వం చాటుకున్న కిడ్మాతే ఇన్సానియత్..

by  |
దాతృత్వం చాటుకున్న కిడ్మాతే ఇన్సానియత్..
X

దిశ, చండ్రుగొండ : భద్రాద్రి కొత్తగూడెం చండ్రుగొండ మండలం తిప్పనపల్లికి చెందిన షేక్ షఫీ అనే యువకుడికి లివర్ పాడైపోయి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వైద్యం చేయించుకోవడానికి డబ్బుల్లేక కుటుంబ పోషణ కూడా భారంగా మారి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడనే విషయం తెలుసుకున్న కిడ్మాతే ఇన్సానియత్ సహాయం చేయడానికి ముందుకు వచ్చంది. దాంతో ఆ సంస్థ సభ్యులు అబ్దుల్ జలీల్, ఇబ్రహీం, తమ వంతు సహాయంగా 12 వేల రూపాయల నగదు, వెయ్యి రూపాయల మందులు, రెండు వేల రూపాయల నిత్యావసర సరుకులను అందించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని, నిరుపేదలకు అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తిప్పనపల్లి కమిటీ సభ్యులు సదర్ రఫీ నాయబ్, యాకూబ్, షేక్ షాకిర్ లు పాల్గొన్నారు.


Next Story