జర్నలిస్ట్‌పై దాడి.. ఆ ఎమ్మెల్యే అనుచరులే అంటున్న బాధితుడు..

239
reporter

దిశ, మాక్లుర్: మాక్లూర్ మండలంలో రిపోర్టర్‌పై గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. రైతుబంధు సంబురాల్లో భాగంగా జెడ్పీ చైర్మన్ దాదన్నగారి విట్టల్ రావు చేసిన వ్యాఖ్యలను న్యూస్ పేపర్‌లో రాయడంతో తనపై దాడి చేశారని జర్నలిస్ట్ పోశెట్టి వివరించారు. బాధితుని వివరాల ప్రకారం.. తాను కొత్తపల్లిలో రైతు బంధు సంబురాల కార్యక్రమంలో పాల్గొనడానికి బయలుదేరిన సమయంలో రోడ్డుపై ఆపి ముగ్గురు వ్యక్తులు కట్టెలతో, ఇనుపరాడ్లతో దాడి చేశారని తెలిపాడు. పొలాల్లో పని చేసేవారు గమనించి దగ్గరకు రాగానే దుండగులు పారిపోయారని చెప్పారు. ఈ మేరకు బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసారు. తనపై దాడి చేసింది ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అనుచరులని బాధితుడు పేర్కొన్నారు. పోశెట్టిపై జరిగిన దాడిని జర్నలిస్ట్ సంఘాలు, జెడ్పీ చైర్మన్ విట్టల్ రావు తదితరులు ఖండించారు. సీసీ పుటెజ్ ఆధారంగా పోలీస్‌లు కేసు విచారిస్తున్నారు.